యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శనివారం తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దర్శించుకున్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులను వెలికితీయడానికి ఈ ఫిల్మ్ ఛాంబర్ ఏర్పాటు చేశామని ఛాంబర్ ఛైర్మన్ రామకృష్ణ గౌడ్ తెలిపారు. దీనిలో సభ్యత్వం తీసుకున్న వారికి... హెల్త్ కార్డులను ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫిల్మ్ ఛాంబర్ ద్వారా 900మంది ప్రొడ్యూసర్లు, 6వేల మంది టెక్నీషియన్లు, 1000 మంది మ్యూజిషియన్లు ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ బూర్గుల మధుసూధన్, ఫిల్మ్ ఛాంబర్ వైస్ ఛైర్మన్ గురురాజ్, వైస్ ప్రెసిడెంట్ పూజిత, నటీనటులు మహేశ్వరీ, ప్రియలు పాల్గొన్నారు.
యాదాద్రిలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు - తెలంగాణ వార్తలు
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ ఛాంబర్లో నమోదు చేసుకున్న వారికి హెల్త్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
Breaking News