తెలంగాణ

telangana

ETV Bharat / state

'యాదాద్రి పనుల్లో అలసత్వాన్ని సహించేది లేదు' - తెలంగాణ సీఎంవో భూపాల్​ రెడ్డి

తెలంగాణ సీఎంఓ యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి... తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

telangana cmo bhupal reddy visit yadadari temple
'త్వరితగతిన పనులు పూర్తిచేయండి'

By

Published : Jan 20, 2020, 7:32 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ సీఎంవో భూపాల్​రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామి వారి ప్రసాదాన్ని అందించారు.

'త్వరితగతిన పనులు పూర్తిచేయండి'
అనంతరం సీఎంవో ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రధాన ఆలయం, శివాలయాల్లోని పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించి... పనుల జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details