తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: యాదాద్రికి సీఎం.. 17న చినజీయర్​ స్వామితో కలిసి పర్యటన! - తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్(cm kcr) వచ్చే వారంలో యాదాద్రిలో(yadadri) పర్యటించే అవకాశం ఉంది. క్షేత్రాభివృద్ది పనులను మరోసారి పరిశీలించనున్నారు. యాడా(ytda) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఆలయ ఉద్ఘాటనకు శుభ ముహూర్తం ఖరారు చేసేందుకు ముందస్తుగా చినజీయర్‌ స్వామితో కలిసి వారం రోజుల్లో యాదాద్రికి వస్తారని యాడా అధికారులు భావిస్తున్నారు.

telangana-cm-kcr-will-visit-yadadri-sri-lakshmi-narasimha-swamy-temple
telangana-cm-kcr-will-visit-yadadri-sri-lakshmi-narasimha-swamy-temple

By

Published : Sep 13, 2021, 11:21 AM IST

భక్త జనులను శ్రీలక్ష్మినరసింహ స్వామి(sri lakshmi narasimha swamy temple) గర్భాలయంలోకి ప్రవేశింపజేయాలన్న లక్ష్య సాధన కోసం సీఎం కేసీఆర్(cm kcr) మరోసారి యాదాద్రికి(yadadri) వెళ్లనున్నారు. ఈ వారంలో యాదాద్రిని సందర్శించనున్నారు. పంచ నారసింహుల ఆలయ ఉద్ఘాటనపై దృష్టి సారించిన సీఎం... ఈ వారంలో వచ్చే అవకాశం ఉందని యాడా అధికారులు తెలిపారు. వచ్చే మంగళవారం లేదా ఈనెల 17న సీఎం యాదాద్రికి వస్తారని సమాచారం. క్షేత్రాభివృద్ది పనులను మరోసారి స్వయంగా పరిశీలించి పనులన్నీ పూర్తయ్యేందుకు మరెంత కాలం పడుతుందో అంచనా వేయనున్నారు.

శుభ ముహూర్తం కోసం..

యాడా(ytda) అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించనున్నారు. ఆలయ ఉద్ఘాటనకు శుభ ముహూర్తం ఖరారు చేసేందుకు ముందస్తుగా చినజీయర్‌ స్వామితో కలిసి వారం రోజుల్లో యాదాద్రికి వస్తారని యాడా అధికారులు భావిస్తున్నారు. కొండపై పునర్నిర్మితమవుతున్న హరిహరుల ఆలయాలతో పాటు, ఇతర కట్టడాలను యుద్ధప్రాతిపదికన చేపట్టి త్వరలోనే పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు. జూన్ 21న ఈ క్షేత్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్... అప్పట్లో పలు సూచనలు చేశారు. నాటి నుంచి కొనసాగుతున్న పనుల పురోగతికి సంబంధించిన వివరాలు సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి ద్వారా సేకరించారు.

స్థల పరిశీలన

ఆలయ ఉద్ఘాటనకు శ్రీసుదర్శన మహా యాగం కోసం సీఎం స్థల పరిశీలన చేయనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలంలో చదును పనులు చేశారు. యాగం నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, సూచనల కోసం చినజీయర్ స్వామిని ఆహ్వానించి, స్వయంగా వెంట తీసుకురావాలని కేసీఆర్ సంకల్పించినట్లు సమాచారం.

ఇదీ చదవండి:Yadadri Temple: దసరా నాటికి యాదాద్రి పనుల పూర్తి చేసేందుకు కసరత్తు

ABOUT THE AUTHOR

...view details