cm kcr yadadri visit: యాదాద్రి నారసింహుని దివ్యాలయ ఉద్ఘాటనకు రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ పనుల పరిశీలనకు వస్తున్నారు. 2014 అక్టోబర్ 17న సీఎంగా తొలిసారిగా కేసీఆర్ వచ్చారు. అప్పటి నుంచి 16 సార్లు యాదాద్రిని సందర్శించారు. నేడు 17వసారి సీఎం కేసీఆర్ నారసింహుని సన్నిధికి వస్తున్నారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకోనున్న యాదాద్రి పనులను పరిశీలించనున్నారు.
యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా.. చేపట్టిన వివిధ పనులు తుదిరూపునకు వచ్చాయి. ప్రధాన రాజగోపురాలు, జీయర్ స్వామి నేతృత్వంలో స్వర్ణ కలశాల స్థాపనకు పరంజాను ఏర్పాటు చేస్తున్నారు. చెన్నైకు చెందిన నిపుణులతో ఏర్పాటవుతున్న ఈ పరంజా పటిష్టతను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇటీవలే పరిశీలించారు.