యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న ప్రధానాలయం పునర్నిర్మాణంలో భాగంగా నూతన గర్భాలయంలో వేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి, ఆలయం పక్కనున్న విశాలమైన స్థలంలో నరసింహ స్వామి, చెంచులక్ష్మిల చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
యాదాద్రి గర్భగుడిలో ఆకట్టుకునే చిత్రాలు - tanjhavur picture news
యాదాద్రి గర్భగుడిలో తంజావూర్ చిత్రకారులు రూపొందించిన చిత్రం ఆకట్టుకుంటోంది. సుమారు 15 రోజులు కష్టపడి ఈ చిత్రాన్ని పంచ రంగులతో అందంగా తీర్చిదిద్దారు.

యాదాద్రి గర్భగుడిలో ఆకర్షిస్తున్న చిత్రం
యాదాద్రి గర్భగుడిలో ఆకర్షిస్తున్న చిత్రం
ఈ చిత్రాన్ని పంచ రంగులతో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. తంజావూరు నుంచి వచ్చిన చిత్రకారులు ఎంతో దీక్షతో చిత్రీకరించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ చిత్రంలో నారదుడు, బ్రహ్మ సరస్వతి, శివపార్వతులు, ప్రహ్లాదుడు, కల్పవృక్షంపై నుంచి గరుత్మంతుడు, మహర్షులు పూల వర్షం కురిసినట్లు రూపొందించారు.
ఇవీ చూడండి:వరంగల్ మహా నగరాభివృద్ధిపై నేడు మంత్రి కేటీఆర్ సమీక్ష