తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకుపచ్చ తెలంగాణకు సరికొత్త వ్యూహం.. యాదాద్రిలో శ్రీకారం - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు

ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్లా ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. యాదాద్రి నమూనాలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి చిట్టడవిని అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న యాదాద్రి నమూనాపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

tangedu vanam project in harithaharam scheme to boost greenary in telangana
ఆకుపచ్చ తెలంగాణకు సరికొత్త వ్యూహం.. యాదాద్రిలో శ్రీకారం

By

Published : Jun 23, 2020, 9:45 PM IST

ఆకుపచ్చ తెలంగాణ ధ్యేయంగా హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం... ఈ దఫాలో ప్రకృతి వనాల అభివృద్ధికి సంకల్పించింది. అన్ని పట్టణాలు, పల్లెల్లో చిట్టడవులను అభివృద్ధి చేసి వనాలుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం అటవీబ్లాక్​లో అభివృద్ధి చేసిన తంగేడువనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో 2018-19లో ఈ తరహా చిట్టడవికి శ్రీకారం చుట్టారు.

నాలుగు వేల మొక్కలు నాటి...

చిట్టడవి అభివృద్ధి కోసం పూర్తిగా నిస్సారంగా ఉన్న నేలను సారవంతం చేశారు. ఇందులో మూడు వరుసలుగా మొక్కలు నాటారు. చిన్న, పెద్ద, గుబురు మొక్కలు, ఏపుగా పెరిగేవి, పండ్లు, పూల మొక్కలు ఇలా నాలుగువేల విభిన్నరకాల మొక్కలు నాటారు.

చిట్టడవుల అభివృద్ధిలో అటవీఅధికారుల పాత్ర కీలకం. నిస్సారవంతమైన భూమిని సారవంతంగా చేసేందుకు నెల రోజుల సమయం పడుతుందని అంటున్నారు అటవీశాఖ అధికారులు.తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా ఎన్నో ప్రయోజనాలుంటాయని, ఇదే తరహాలో యాదాద్రి జిల్లాల్లో మరిన్ని చిట్టడవులు అభివృద్ధి చేస్తున్నట్లు జిల్లా అటవీ అధికారి తెలిపారు.

-డి.వి.రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా అటవీఅధికారి

కార్యక్రమంలో భాగమైనందకు సంతోషం..

హరితహారంలో భాగంగా తంగేడు వనం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైనందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టానికి ప్రతిఫలం లభించిందని తెలిపారు.

అడవులు లేవన్న కొరతను తీర్చేలా చిట్టడవుల అభివృద్ధిని చేపట్టాం. ఆ ప్రయత్నం ఫలించి రాష్ట్ర వ్యాప్తంగా యాదాద్రి నమూనాను అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం గర్వకారణంగా ఉంది. చౌటుప్పల్​తో పాటు రాష్ట్రంలో మిగతా కొన్ని చోట్ల కూడా ఈ తరహా చిట్టడవులను అభివృద్ధి చేశారు.

-​ అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్​.

యాదాద్రి తరహాలోనే అన్ని గ్రామాలు, పట్టణాల్లో ప్రకృతి వనాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. నిర్ణీత ప్రదేశాన్ని గుర్తించి చదును చేసి సారవంతంగా మార్చి ఆ తర్వాత మొక్కలు నాటి సంరక్షించాలని స్పష్టం చేసింది. చుట్టూ ఏపుగా పెరిగే మొక్కలు నాటడంతో పాటు స్థానిక పొల స్వభావాన్ని బట్టి విభిన్న రకాల మొక్కలు నాటాలని తెలిపింది. చుట్టూ నడకకు వీలుగా ట్రాక్ ఏర్పాటు, కూర్చునేందుకు సిమెంట్ బల్లలు ఏర్పాటు చేయాలని సూచించింది. గ్రామాల్లో ఉపాధిహామీ నిధులతో ప్రకృతివనాలను అభివృద్ధి చేయాలని తెలిపింది.

ఇదీ చూడండి:'హరితహారం ఓ పుణ్యకార్యం... ప్రతిఒక్కరి భాగస్వామ్యం అవసరం'

ABOUT THE AUTHOR

...view details