యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి స్థూపాల వద్ద ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు.
యాదాద్రి జిల్లాలో తమ్మినేని పర్యటన.. అమరుల స్థూపాలకు నివాళులు - cpm news
యాదాద్రి భువనగిరి జిల్లాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పర్యటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి స్థూపాల వద్ద ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు.
యాదాద్రి జిల్లాలో తమ్మినేని పర్యటన.. అమరుల స్థూపాలకు నివాళులు
తమ్మినేని వీరభద్రంకు సుంకి శాల గ్రామంలో కామ్రెడ్లు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో రజాకార్లు, భూస్వాములు సాగించిన మారణకాండను, ప్రజలు వారిని ఎలా ఎదుర్కొన్నారో వివరించారు. ఆనాడు నైజాం సర్కారు పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ప్రజల చేత వెట్టి చాకిరీ చేయించారని గుర్తు చేశారు.