తెలంగాణ

telangana

ETV Bharat / state

చలి పంజాతో మొదలైన స్వెటర్ల కొనుగోళ్లు - yadadri bhongir latest news

శీతాకాలం వచ్చేసింది... ఇక దుప్పటి కప్పుకున్న వణుకు ఆగడం లేదు. కార్తిక పౌర్ణమి మరుసటి రోజు నుంచే చలి పంజా విసురుతోంది. సాయంత్రం నుంచే జనం అడుగు పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఉదయం వేళల్లో బయటకు వెళ్తున్న వారంతా స్వెటర్లు, మంకీ క్యాప్​లు ధరిస్తున్నారు. చలి పుణ్యమా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్ని దుస్తుల వ్యాపారం జోరుగా సాగుతోంది.

sweaters Purchases started in yadadri bhongir district

By

Published : Nov 19, 2019, 6:51 AM IST

చలి పంజాతో మొదలైన స్వెటర్ల కొనుగోళ్లు

యాదాద్రి భువనగిరి జిల్లాలో చలి పంజా విసురుతోంది. జనాలు స్వెటర్లు, మంకీ క్యాప్​లతో దర్శనమిస్తున్నారు. వృద్ధులు శాలువాలు కప్పుకుంటున్నారు. ఇక యువత రకరకాల మోడళ్లతో లభ్యమవుతున్న స్వెటర్లు ధరించి న్యూలుక్​తో కనబడుతున్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి విక్రయం

ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్​, మధ్యప్రదేశ్​, పంజాబ్​, రాజస్థాన్​ రాష్ట్రాల నుంచే కాకుండా నేపాల్​ నుంచి వచ్చిన వ్యాపారులు యాదగిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలలో రోడ్లపై దుకాణాలను ఏర్పాటు చేసుకుని విక్రయిస్తున్నారు.

సామాన్యులకు అందుబాటులోనే

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్ని దుస్తులు సామాన్య ధరలకే లభ్యమవుతున్నాయి. జిల్లాలో 100 నుంచి 600 రూపాయల్లో స్వెటర్లు దొరుకుతున్నాయి. పెద్ద దుకాణాల్లో నాణ్యమైన స్వెటర్లు, రెయిన్​కోట్​లు, జర్కిన్​లు 500 నుంచి 1200 రూపాయల్లో లభ్యమవుతున్నాయి.

వారికి ఇవే జీవనాధారం

యాదగిరిగుట్టతో పాటు జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుణాకాలు ఏర్పాటు చేసుకుని అందులో దుప్పట్లు, బ్లాంకెట్లు, స్వెటర్లు, జర్కిన్​లు స్టోర్​ చేశారు. వాటిని సమీపంలోని గ్రామాల్లో తిరుగుతూ వ్యాపారం సాగిస్తున్నారు. తమకు ఇదే జీవనాధారమని వ్యాపారులు చెబుతున్నారు.

తగిన జాగ్రత్తలు తప్పనిసరి

శీతాకాలంలో చలిబారిన పడితే శ్వాసకోస సంబంధవ్యాధులు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. వ్యాధుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: చిత్రకళలో ఔరా అనిపించిన అంధులు

ABOUT THE AUTHOR

...view details