తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్ర పూజలు - Yadadri Bhuvanagiri Latest News

యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు రెండు గంటలు అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు జరిపారు. భక్తులు అభిషేకాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Swati Nakshatra Pujas in Yadadri Sri Lakshmi Narasimha Swami Temple in Yadadri
ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వాతి నక్షత్ర పూజలు

By

Published : Mar 3, 2021, 3:20 PM IST

నేడు లక్ష్మీ సమేత నారసింహుని జన్మ నక్షత్రం.. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు.

నారసింహుని జన్మనక్షత్రం సందర్భంగా బాలాలయ మండపంలో శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కలశాల్లోని జలాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిపారు. పాలు, పెరుగు వివిధ శుద్ధ జలాలతో వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో సుమారు రెెండు గంటలు అష్టోత్తర శత ఘటాభిషేక పూజలు నిర్వహించారు.

స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు పుష్పాలతో అర్చన చేశారు. అష్టోత్తర శతఘటాభిషేకం పూజల్లో ఆలయ ఈఓ గీతా రెడ్డి, అనువంశిక ధర్మ కర్త నరసింహ మూర్తి, అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చూడండి:రీజనల్‌ రింగ్‌ రోడ్​తో పరిసర ప్రాంతాల అభివృద్ధి: గణపతి రెడ్డి

ABOUT THE AUTHOR

...view details