యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాల్లోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు.
యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
యాదాద్రిలో స్వాతి నక్షత్ర పూజలను ఘనంగా జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు.
యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు
ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త నర్సింహ మూర్తి, ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి