కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్ మండల కేంద్రంలోని కూడళ్లలో వాల్ పెయింటింగ్ వేయించారు. కరోనాను తరిమికొడదాం.. లాక్డౌన్ పాటిద్దాం, మాస్కులు ధరించాలి అంటూ గోడలపై రాయిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు.
కరోనాపై వాల్ పెయింటింగ్ వేయించిన సర్పంచ్ - కరోనాపై వాల్ పెయింటింగ్ వేయించిన సర్పంచ్
సర్పంచ్‌గా గ్రామాభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమమే తన బాధ్యతగా ముందుకు సాగుతున్నారు రామన్నపేట సర్పంచ్ శిరీషా పృథ్వీరాజ్. కరోనా వైరస్ నివారణకు గ్రామంలో వాల్ పెయింటింగ్ వేయించి ప్రజల్ని చైతన్య పరుస్తున్నారు.
కరోనాపై వాల్ పెయింటింగ్ వేయించిన సర్పంచ్
ముఖ్యమంత్రి కేసీఆర్, కలెక్టర్ అనితా రామచంద్రన్ సూచనలు సలహాలు తాను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తున్నానని సర్పంచ్ శిరీషా చెప్పారు. యాదాద్రి జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని హర్షం వ్యక్తం చేశారు.
ఇది చూడండి:కరోనా గురించి వారికి ఇంకా తెలియదట!