బస్సు-లారీ ఢీ... త్రుటిలో తప్పిన ప్రమాదం హన్మకొండ-హైదరాబాద్ జాతీయ రహదారిపై త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి హన్మకొండకు వెళ్తున్న వరంగల్ 2 డిపో సూపర్ లగ్జరీ బస్సు జనగామ జిల్లా పెంబర్తి గ్రామ శివారులో లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఒక్కసారిగా ప్రయాణికులంతా ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. పెను ప్రమాదం నుంచి తృటిలో బైటపడ్డందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వేరే బస్సులో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చారు.