తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో భారత దేశ ప్రధాన నరేంద్రమోదీ పేరుతో సుదర్శన హోమం పూజలు నిర్వహించారు అర్చకులు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ నుంచి భాజపా రాష్ట్ర నాయకులు ఆన్లైన్లో 1,116 రూపాయలు చెల్లించి నరసింహ సుదర్శన హోమం పూజకు టికెట్ బుక్ చేశారు.
మోదీ పేరుతో యాదాద్రి ఆలయంలో సుదర్శన హోమం - pm modi news
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో మోదీ పేరుతో సుదర్శన హోమం నిర్వహించారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

మోదీ పేరుతో యాదాద్రి ఆలయంలో సుదర్శన హోమం
దీనితో ఆలయంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గోత్రనామాలతో ఆలయ ఉపప్రదాన అర్చకులు మోహనాచార్యులు సుదర్శన హోమం, ఇతర పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయురారోగ్యాలతో జీవించాలని... దేశం సుభిక్షంగా ఉండాలని ఆశీర్వచనాలను అందచేస్తూ... స్వామి వారకి పుష్పార్చన చేశారు.