యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల పరిదిలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ, ఆర్యవైశ్య సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సక్సెస్ మంత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చదువంటే భయపడకుండా చదివినవారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆమె తెలిపారు.