తెలంగాణ

telangana

ETV Bharat / state

సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి ఏం చేశారంటే..? - యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్

సెలవు రోజు అయిన రెండో శనివారం ఓ సబ్ రిజిస్టార్.. రిజిస్టర్​ కార్యాలయాన్ని తెరిచి.. సీసీ కెమెరాలు ఆఫ్ చేసి అనుమానాస్పదంగా పని చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో జరిగింది. వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ కోసం వచ్చారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సబ్ రిజిస్టార్ ఆనంద్

By

Published : Sep 15, 2019, 9:26 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో సబ్ రిజిస్టార్ ఆనంద్ సెలవు రోజు.. తన అనుచరులతో కలిసి రిజిస్టర్ కార్యాలయం వెనక ద్వారం నుంచి లోనికి వెళ్లారు. సీసీ కెమెరాలు ఆఫ్ చేశారు. గమనించిన స్థానికులు, మీడియా, కార్యాలయంలోకి వెళ్లి ఆరాతీయగా.. ఖంగు తిన్న సబ్ రిజిస్ట్రార్.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఇప్పటికే సబ్ రిజిస్టర్ ఆఫీస్​లో భారీగా అవినీతి జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వందే ఫైళ్లు కదలని పరిస్థితులున్నాయి. వివాదాస్పద భూములు రిజిస్ట్రేషన్ కోసమే సబ్​ రిజిస్టార్​ కార్యాలయానికి వచ్చినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు.

సీసీ కెమెరాలు ఆఫ్​ చేసి ఏం చేశారో?

ABOUT THE AUTHOR

...view details