భువనగిరి పట్టణంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఓ పాఠశాలలో 73వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు.. భారతదేశ చిత్రపటం ఆకారంలో కూర్చుని దేశభక్తిని చాటారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన 72 సంవత్సరాల తర్వాత జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతంల్లో మొట్టమొదటిసారి అధికారికంగా జెండాను ఎగురవేయనున్నారని కార్యదర్శి బొంగోని ప్రశాంత్ అన్నారు. దేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా జాతీయ జెండాను ఎగురవేస్తామని తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో 1991లోనే లద్దాఖ్ ప్రాంతంలో వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండా ఎగర వేసి అనేకమంది అమరులైనారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పాఠశాల పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.
భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన - కూర్చుని ప్రదర్శన
జాతీయత, దేశభక్తి మా ప్రాణం అంటూ భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులు కూర్చుని భువనగిరి పట్టణంలో ప్రదర్శన చేశారు.
![భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4130778-209-4130778-1565759798735.jpg)
భారతదేశం ఆకారంలో కూర్చుని ప్రదర్శన