తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత - latest news on Gongidi Sunita

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Students need to be disciplined: Gondi Sunita
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత

By

Published : Jan 7, 2020, 11:14 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని దూదివెంకటాపురం, బొందుగుల గ్రామాల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి​ సునీత మహేందర్​రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ముందుగా బొందుగులలో హమాలీ కార్మిక భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పాల కేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం దూదివెంకటాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నూతన భవనాలను ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని, వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. మన ఎదుగుదల మన క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుందని.. తోటివారితో మర్యాదగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత

ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details