సంక్రాంతి సెలవులు రావడం వల్ల సొంత గ్రామాలకు వెళ్లే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తెల్లవారుజాము నుంచే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సుమారు కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్రా'ఫికర్': పంతంగిలో కిలోమీటరు మేర స్తంభించిన వాహనాలు - పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ మేర నిలిచిపోయిన ట్రాఫిక్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
కిలో మీటర్ మేర నిలిచిపోయిన ట్రాఫిక్
టోల్ గేట్ సిబ్బంది విజయవాడ వైపు 4 కాష్ అండ్ క్యారీ, 5 ఫాస్ట్ ట్యాగ్ వాహనాలు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ ట్రాఫిక్ ను నియంత్రించండ కష్టంగా మారుతోంది. టోల్, ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు వేగంగా వాహనాలను పంపడానికి ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇవీ చూడండి: నేటితో 'పల్లె ప్రగతి 2.o' ముగింపు