తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి కలెక్టరేట్‌లో కత్తి పోటు కలకలం - అదే కారణమా? - Yadadri Bhuvana gIri Crime News

Stabbing in Yadadri Collectorate
AO employee Attack on AEO in Yadadri Collector Office

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2023, 3:35 PM IST

Updated : Nov 10, 2023, 8:23 PM IST

15:29 November 10

ఏఈవో మనోజ్‌పై కత్తితో ఏవో శిల్ప దాడి

Stabbing in Yadadri Collectorate Office : యాదాద్రి భువనగిరి జిల్లాలోని కలెక్టరేట్​లో కత్తిపోటు కలకలం రేపింది. ఆత్మకూరు మండల వ్యవసాయ శాఖ అధికారిగా పని చేస్తున్న శిల్పకు.. 2012లో సుధీర్​ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. రెండు సంవత్సరాలుగా ఆమె భర్తతో దూరంగా ఉంటుంది. యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట ఏఈవో పని చేస్తున్న మనోజ్​తో ఈ రెండు సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మనోజ్​ రెండు నెలలుగా కార్యాలయానికి సెలవు పెట్టాడు. అనంతరం రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా.. అధికారులు మనోజ్​కు ఎన్నికల విధులు వేయడంతో కలెక్టరేట్​లోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చాడు.

Husband Killed Wife in Hyderabad Today : నాగోల్​లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య.. ఆపై భవనం నుంచి దూకి భర్త ఆత్మహత్య

Women Attacked a Person in Yadadri Collector Office: అదే సమయంలో అక్కడ ఉన్న శిల్పకు- మనోజ్​కు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మనోజ్​పై శిల్ప కత్తితో దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఉద్యోగుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని శిల్పను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Father Kill Daughter in Khammam : మరో ఘటనలో ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ వ్యక్తి తన కుమార్తె, అల్లుడిపై గడ్డపారతో దాడి(Father Attack with a shovel) చేశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం తాడిపూడి గ్రామానికి చెందిన రాములు.. అదే గ్రామానికి చెందిన అల్లుడు రామకృష్ణ, కుమార్తె ఉషపై శుక్రవారం ఉదయం దాడికి పాల్పడ్డాడు. దీంతో ఉష (28) ఘటనా స్థలంలోనే మృతి చెందింది. అల్లుడు తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రాములు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Husband Killed his Wife and Brother-in-law: తిరుపతిలో జంట హత్యల కలకలం.. భార్య, బావమరిదిని కిరాతకంగా చంపిన వ్యక్తి

Man Killed Brother in Hyderabad : నీ వల్లే నా భార్య వెళ్లిపోయింది.. తమ్ముడిని దారుణంగా హతమార్చిన అన్న

Last Updated : Nov 10, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details