తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుని కొండపై కనులవిందుగా సీతారాములోరి కల్యాణం..

srirama navami celebrations: యాదాద్రీశుని కొండపై రాములోరి కల్యాణం కమణీయంగా జరిగింది. సీతారాముల వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి.

srirama-navami-celebrations-in-yadari
srirama-navami-celebrations-in-yadari

By

Published : Apr 10, 2022, 10:53 PM IST

srirama navami celebrations: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి అనుబంధ ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళవాద్యాలు, మత్రోశ్చరణల మధ్య జరిగిన రాములోరి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కల్యాణ మండపంలో కొలువుదీరిన సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వధూవరుల వేషధారణలో.. వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాలతో సీతారాములు ధగధగ మెరిసిపోయారు.

రాములోరికి యజ్ఞోపవిత ధారణ...

సీతారాముల కల్యాణ క్రతువు దాదాపు గంటకు పైగా కొనసాగింది. కల్యాణ ఘడియ సమీపించగానే సీతమ్మవారి మెడలో రఘునందనుడు మాంగళ్యధారణ గావించారు. లోకకల్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను పెళ్లాడి ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేదపండితులు ప్రవచించారు. అనంతరం భక్తలకు ప్రసాద వితరణ, తలంబ్రాలు పంపిణీ చేశారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details