తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి బాల అయంలో వైష్ణవ సాంప్రదాయం, పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపనున్నారు. 12వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

srikrishnastami celebrations in yadadri laxmi narasimha swamy temple
యాదాద్రిలో నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు

By

Published : Sep 10, 2020, 8:11 AM IST

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బాల అలయంలో వైష్ణవ సాంప్రదాయం, పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపనున్నారు. ఈ వేడుకలు శనివారం వరకు నిర్వహించనున్నారు. స్వామి వారికి ఎకాంత సేవ నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.

నేడు కృష్ణాష్టమి (జయంతి) కణ్ణన్ తిరునక్షత్ర వేడుకలు, 12వ తేదీన సాయంత్రం ఉట్లోత్సవం, అదే రోజు రాత్రి 7 గంటలకు రుక్మిణీ కళ్యాణం నిర్వహిస్తామని పేర్కొన్నారు. యాదాద్రి ఆలయంలో మాదిరిగానే పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం సుదర్శన నరసింహ హోమం నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రులు తెలంగాణకు వచ్చి కథలు చెబుతున్నారు : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details