యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని శ్రీ కోదండరామ స్వామి కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. పురోహితులు వేద మంత్రాలు చదువుతుంటే సిగ్గుపడుతున్న సీతమ్మ మెడలో తాళి కట్టాడు ఆ రామచంద్రుడు. కొండపాక నరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఆరుట్ల వేణుగోపాలాచార్యులు, శ్రీకాంత్ కారంపూడి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో యజ్ఞం నిర్వహించారు. స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు, వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం - రఘువంశ రామయ్య...
రఘువంశ రామయ్య... సుగుణాల సీతమ్మల కల్యాణం ఎన్ని సార్లు చూసినా తనివితీరదంటున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు. నిన్న రాత్రి శ్రీ కోదండరామ స్వామి కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
కన్నుల పండువగా సీతారాముల కల్యాణం