యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో శ్రీ రామలింగ స్వామి శోభాయాత్రను శనివారం రాత్రి శేష వాహనంపై ఘనంగా నిర్వహించారు. స్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా అగ్ని గుండాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ సూర్యోదయంలో నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారితో పాటు భక్తులు ఆలయ ప్రవేశం చేశారు.
శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణం... అగ్నిగుండాల ప్రవేశం - అగ్నిగుండాల కార్యక్రమం
శ్రీ రామలింగేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో భాగంగా మోత్కూరులో అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం... అగ్నిగుండాల ప్రవేశం