తెలంగాణ ప్రభుత్వం(TELANGANA GOVERNMENT) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి పుణ్యక్షేత్రం(Yadadri temple renovation) పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అటు ఆధ్యాత్మికత.. ఇటు ఆధునికతను జోడించి నిర్మిస్తోన్న యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం(Yadadri temple renovation) రాష్ట్రానికే వైభవాన్ని తీసుకురానుంది. ఆలయ ఆవరణలో నిర్మితమవుతున్న శ్రీ పర్వతవర్ధిని ఆలన పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆలయ రథశాలకు శైవాగమ ఆచారంగా నలువైపులా ఫైబర్‌తో సాలహారాలు.. వాటిలో శివపార్వతుల రూపాలను పొందుపరుస్తున్నారు. బసవన్నపై పార్వతీ, పరమేశ్వర రూపాలతో ఆకర్షణీయమైన రథశాలగా రూపొందుతోంది.
yadadri: యాదాద్రిలో శివుడి రథశాలకు తుది మెరుగులు - తెలంగాణ తాజా వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ (yadadri ) పునర్నిర్మాణ పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఆలయ ఆవరణలో నిర్మితమవుతున్న శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
yadadri
ఆలయముఖ మండపంలో స్పటిక లింగం స్థాపన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శివాలయ ముఖ మండపంలో స్పటిక లింగం, నంది విగ్రహం ఏర్పాటుకు పనులను వేగవంతం చేశారు. ఆలయ పునర్నిర్మాణం పూర్తికావొస్తున్న దశలో ఈ విశేష పర్వాలను చేపట్టాలని యాడా నిర్ణయించింది.
ఇదీ చూడండి:Yadadri temple renovation : యాదాద్రికి ఐరావతాలు.. అద్దాల మండపానికి బిగించేందుకు సన్నాహాలు