తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో శరవేగంగా ఇత్తడి దర్శన వరుసల నిర్మాణం - తెలంగాణ వార్తలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రధానాలయంలోని ఇత్తడి దర్శన వరుసల నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. స్టీల్ దర్శన వరుసలకు మెరుగులు పెడుతున్నారు. గోడలను అందంగా తీర్చి దిద్దుతున్నారు.

sri lakshmi narasimha swamy temple works, yadadri temple
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

By

Published : May 24, 2021, 1:07 PM IST

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ప్రధానాలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇత్తడి దర్శన వరుసల పనులు త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని వైటీడీఏ పేర్కొంది. ఇప్పటికే కావల్సిన సామాగ్రిని యాదాద్రికి తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ మండపం ముందు భాగంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన వరుసలకు అష్టభుజి మండపంలోని క్యూలైన్లకు కలిపే పనులను చేస్తున్నారు. వరుసల పై కప్పు పనులు సాగుతున్నాయి. ఈ నెలాఖరు దర్శన వరుసల పనులుపూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు.

స్టీల్ దర్శన వరుసలకు మెరుగులు

నూతన ప్రధానాలయంలో మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన స్టీల్ దర్శన వరుసలకు మెరుగులు దిద్దే పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయం, కృష్ణశిల మధ్య ఏర్పాటు చేసిన డంగు సున్నం, వీటితో కలిపిన మిశ్రమం (కరక్కాయ, నార, నల్లబెల్లం) బయటికి వచ్చి గోడలన్నీ అపరిశుభ్రంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు. ఆలయ గోడలు ఆకర్షణీయంగా కనబడేందుకు రసాయనాలతో ప్రత్యేకంగా తయారు చేసిన గమ్​తో టేప్​ను అంటిస్తున్నారు.

ఇదీ చదవండి: పల్లె బతుకులు ఆగం.. కరోనా పరీక్షలు చేయక వేగంగా వ్యాప్తి!

ABOUT THE AUTHOR

...view details