యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన నిర్వహించారు. కరోనా నుంచి విముక్తి కలగాలని కాంక్షిస్తూ... లోక కల్యాణార్థం ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన, సుదర్శన నరసింహ హోమం వంటి ప్రత్యేక పూజలు జరిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివిధ రకాల పుష్పాలతో నారసింహుని అలంకరించి.. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా జరిపారు.
వైభవంగా లక్ష్మీ నారసింహుని లక్ష పుష్పార్చన - తెలంగాణ వార్తలు
ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీ నారసింహునికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. వివిధ రకాల పూలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. కరోనా నుంచి విముక్తి కలిగించాలని స్వామిని వేడుకున్నట్లు అర్చకులు వివరించారు.
యాదాద్రిలో లక్షపుష్పార్చన, యాదాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు
విశ్వ శాంతి చేకూరాలని కోరుతూ... సీఎం కేసీఆర్తో పాటు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు జరిపినట్లు అర్చకులు వివరించారు.
ఇదీ చదవండి:మూడు ముళ్లకు కరోనా ముల్లు!