యాదాద్రి క్షేత్రంలో నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్నట్లు ఈవో గీతారెడ్డి శుక్రవారం వెల్లడించారు. మూడు రోజుల పాటూ సాగే వేడుకల్లో తొలిరోజు లక్ష పుష్పార్చనతో పాటు ఉదయం తిరువేంకట పతి అలంకార సేవాపర్వాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, అభిషేకాలు జరుగుతాయి. రెండో రోజున లక్ష కుంకుమార్చన, కాళీయమర్ధన అలంకార సేవాపర్వం, మూల మంత్ర హవనం, హనుమంత వాహనంపై శ్రీరామ అలంకార సేవలుంటాయి.
ఏకాంతంగానే నారసింహుని జయంత్యుత్సవాలు - తెలంగాణ వార్తలు
నారసింహుని జయంత్యుత్సవాలను ఈనెల 23 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. తొలిరోజు లక్ష పుష్పార్చనతో పాటు ఉదయం తిరు వేంకటపతి అలంకార సేవాపర్వాన్ని జరపుతారు. లాక్‌డౌన్ కారణంగా ఏకంతంగానే జరపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంత్యుత్సవాలు, యాదాద్రి ఆలయం
చివరి రోజున శ్రీ లక్ష్మీ సమేతుడైన నారసింహుడి అష్టోత్తర శతఘటాభిషేకం, మహాపూర్ణాహుతి, సాయంత్రం నృసింహ ఆవిర్భావం నిర్వహిస్తారు. అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట ఆలయంలోనూ శ్రీ స్వామి జయంతి వేడుకలను చేపడతారని ఈవో పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా వేడుకలన్నీ బాలాలయంలో ఏకాంతంగా కొనసాగనున్నాయి. బాలాలయంలో ఈ వేడుకలు జరగడం ఇది ఆరోసారి.
TAGGED:
telangana news