యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో నిన్న అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రావణి కుటుంబ సభ్యులు, బంధువులు భువనగిరి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆందోళనకారుల నిరసనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని శ్రావణి బంధువులు ఆరోపించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన శ్రావణి గురువారం ప్రత్యేక తరగతులకని వెళ్లి అదృశ్యమైంది. గాలింపు చేపట్టగా గ్రామ శివారులోని బావిలో మృతదేహం లభ్యమైంది.
'శ్రావణి హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి' - శ్రావణి హత్య కేసు
మైనర్ బాలిక శ్రావణి అనుమానాస్పద మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని భువనగిరి రహదారిపై ఆమె బంధువులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపించారు. బంధువుల నిరసనతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
శ్రావణి హత్యకేసు
ఇదీ చదవండి : నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తాం: గొంగిడి సునీత