తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి అష్టోత్తర శతఘటాభిషేకం - యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి

స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టి ప్రతిష్ట మూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు.

special Worship to yadadri laxminarasimha swamy in yadadri bhuvanagir district
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు

By

Published : Sep 20, 2020, 4:17 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టి ప్రతిష్ట మూర్తులను ఆరాధిస్తూ హారతి నివేదించారు. తులసి పత్రాలతో అర్చించి.. దర్శన మూర్తులకు సువర్ణ పుష్పార్చన చేశారు. శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశాలలోని జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.

పాలు, పెరుగుతో వేదమంత్రలు, మంగళవాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్, ఆలయ ఈవో గీతారెడ్డి గిరిప్రదక్షణ చేశారు. తెల్లవారుజామున యాదాద్రి కొండ చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో ప్రదక్షణ చేశారు. కొవిడ్​ నిబంధనల ప్రకారమే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.

ఇదీ చదవండి:చాలా రోజుల తర్వాత యాదాద్రిలో భక్తుల రద్దీ

ABOUT THE AUTHOR

...view details