యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. బాలాలయ మండపంలో 108 కలశాలకు శత ఘటాభిషేక పూజలు చేశారు. వివిధ ఫల రసాలు, పంచామృతాలతో స్వామి, అమ్మవార్లను అభిషేకించారు.
స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు - స్వాతి నక్షత్రం వార్తలు
స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి జన్మ నక్షత్రం కావడంతో బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులు ప్రత్యేక వేదికపై కొలువు దీరారు. దర్శనానికి విచ్చేసిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు
బాలాలయంలో ఉత్సవ మూర్తులు ప్రత్యేక వేదికపై కొలువు దీరారు. అనంతరం సువర్ణ పుష్పాలతో దేవతా మూర్తులను అర్చించారు. హరిహరులను దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత