యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్రంలో పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామాలతో పూజలు జరుగుతున్నాయి. లాక్డౌన్ కారణంగా ప్రభుత్వం సూచనల మేరకు స్వామి వారి ఆలయంలోకి భక్తులకు ప్రవేశాన్ని నిలిపేశారు. స్వామివారి ఆర్జిత సేవలలో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేనందున... భక్తుల గోత్రనామాలతో పరోక్ష పద్ధతిన నిర్వహిస్తున్నారు.
యాదాద్రీశుని ఆలయంలో కేసీఆర్ గోత్రనామాలతో అర్చన - CORONA UPDATES
సీఎం కేసీఆర్ వివాహ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రీశుని ఆలయంలో ఆయన గోత్రనామాలతో అర్చన జరిపారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి నిత్యం పరోక్ష పద్ధతిలో భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహిస్తున్నారు.

యాదాద్రీశుని ఆలయంలో కేసీఆర్ గోత్రనామాలతో అర్చన
స్వామివారి నిత్య కైంకర్యాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. నేడు సీఎం కేసీఆర్ వివాహదినోత్సవం సందర్భంగా వారి గోత్ర నామాలతో అర్చన చేశారు. సువర్ణ పుష్పార్చన చేశారు. ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.