తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి సన్నిధిలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు - యాదాద్రిలో అంజన్నకు పూజలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయ సన్నిధిలో ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ చందనం, సింధూరంతో అభిషేకం చేసి.. తమలపాకులతో అలంకరించారు.

puja for anjaneya swamy at yadadri
యాదాద్రి సన్నిధిలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

By

Published : Sep 22, 2020, 3:00 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో మంగళవారం పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. యాదగిరీశుని ఆలయ సన్నిధిలోని విష్ణు పుష్కరిణి చెంతనున్న ఆంజనేయ స్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని సింధూరంతో అభిషేకించి.. తమలపాకులతో అలంకరించారు.

హనుమంతుడిని శ్రీ చందనంతో అభిషేకం చేసి శ్రవణానందంగా లలితా పారాయణం చేశారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన వడలు, బెల్లంతో చేసిన వివిధ రకాల ఆహారాలను నైవేద్యాలుగా సమర్పించారు. భక్తులు.. భౌతిక దూరం పాటిస్తూ కొవిడ్​ నిబంధనలతో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇదీ చదవండిఃతిరుమల బ్రహ్మోత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై కోనేటిరాయుడు

ABOUT THE AUTHOR

...view details