చుట్టూ రాతి కట్టడం, దారిపొడవునా మెట్లు, అవన్నీ దాటి వెళ్తే నీరు... అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం. ఇదంతా యాదాద్రి జిల్లా చౌటుపల్లి పరిధి లింగోజిగూడెంలో... హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉంది. మూడున్నర శతాబ్దాల క్రితం నిర్మించిన దిగుడుబావికి... పురాతన కట్టడంగా ప్రత్యేక పేరుంది. 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 80 అడుగుల లోతులో నిర్మించారు. 60 అడుగుల వరకు మెట్లు నిర్మించారు. మెట్లబావిని పూర్తిగా రాయితోనే నిర్మించారు. చెత్త, చెదారం పేరుకుపోయి... పిచ్చిమొక్కలతో నిండిపోయిన ఈ మెట్లబావిని... హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టిసారించి అభివృద్ధి చేసింది.
బావిలో ప్రత్యేక గదులు:కొన్నేళ్ల క్రితం ఈ బావి 15 గ్రామాలకు తాగునీటి అవసరాలు తీర్చేది. ఇటుగా వెళ్లే బాటసారులకూ నీడనిచ్చేది. ఒకప్పుడు గోసాయిమఠంగా పిలవబడిన ఈ ప్రాంతంలో... అప్పటి పాలకులు వారికి అనుగుణంగా ఇక్కడ విశ్రాంతి, విడిది కేంద్రాన్ని నిర్మించుకున్నారు. దాదాపు ఐదు అంతస్తులతో నిర్మించిన ఈ బావిలో... స్నానాలు చేసినవారు దుస్తులు మార్చుకునేందుకు... భూమి నుంచి 25 అడుగుల దిగువన.... ప్రత్యేక గదులను నిర్మించారు.
అప్పుడు ఈ బావిలో చెట్లు చెదారం ఉండేది. ప్రభుత్వం పట్టించుకోని అద్భుతంగా తీర్చిదిద్దారు. దీన్ని అందరూ సందర్శించి.. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. పునర్ వైభవం తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి.