యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయిగూడెం శివారులో ఉన్న సురేంద్రపురిలో కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఫౌండర్, ఛైర్మన్ కుందా సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఆలయంలో విఘ్నేశ్వర, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, మొదలగు పూజలు చేపట్టారు.
సురేంద్రపురిలో ఈ నెల 29, 30న ప్రత్యేక పూజలు - యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురి తాజా వార్తలు
యాదాద్రి భువనగిరి జిల్లా సురేంద్రపురిలో ప్రత్యేక కార్తిక మాస పూజలు శనివారం నుంచి ప్రారంభించారు. ఈ నెల 29, 30న పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
![సురేంద్రపురిలో ఈ నెల 29, 30న ప్రత్యేక పూజలు Special pujas on the 29th and 30th of this month in Surendrapuri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9699846-867-9699846-1606582696165.jpg)
కళ్యాణ తంతులో స్వామి, అమ్మవార్లకు యజ్ఞోపవితం, మాంగళ్యధారణ, తలంబ్రాలు,మొదలగు కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ఈ నెల 29న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, అలంకారం, వడమాల నివేదన హోమాలు ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ నెల 30న కార్తిక శ్రీ పంచముఖ పరమేశ్వర మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం జరుపుతామన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కార్తిక దీపోత్సవం, తులసి పూజ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నర్సింహరావు దంపతులు సోమ్ చంద్, ధర్మాధికారి జయశంకర్, బాలగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :ధరణి వెబ్‌సైట్‌కు ఫేక్ యాప్ తయారు