తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి సాలహార విగ్రహాలకు ప్రత్యేక పూజలు

యాదాద్రి సాలహార విగ్రహాలకు వైటీడీఏ అధికారులతో కలసి ప్రధాన స్థపతివేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెంబర్తిలో రూపొందుతున్న ఇత్తడి నగిషీలను పరిశీలించారు.

By

Published : Mar 18, 2021, 10:51 AM IST

యాదాద్రి సాలహార విగ్రహాలకు ప్రత్యేక పూజలు
యాదాద్రి సాలహార విగ్రహాలకు ప్రత్యేక పూజలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి, ప్రధానాలయ పునర్నిర్మాణంలో భాగంగా సాలహారాల్లో పొందుపరిచే రాతి విగ్రహాలకు వైటీడీఏ అధికారులతో కలసి ప్రధాన స్థపతివేలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటివరకు విష్ణుమూర్తి రూపంలోని దశావతారాల్లో వివిధ రూపాలను సాలహారాల్లో పొందుపరిచామని... ఈ విగ్రహాలు కేవలం నారసింహ రూపంలో ఉన్న దశావతారాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్తపతివేలు తెలిపారు.

సాలహార విగ్రహాలు

పెంబర్తి నగిషీల పరిశీలన

యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా... ఆలయ ద్వారాలు, ఇతర తొడుగులకు ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు పెంబర్తిలో రూపొందుతున్న ఇత్తడి నగిషీలను యాడ ప్రధాన స్థపతి వేలు పరిశీలించారు. కళాత్మకంగా ద్వారాలు, ఇతర తొడుగులు ఉండేందుకు పెంబర్తి కళాకారులతో తొడుగులు రూపొందించాలని సీఎం కేసీఆర్ చేసిన సూచనలతో వాటిని రూపొందిస్తున్నారు.

ఇత్తడి నగిషీలను పరిశీలిస్తున్న స్థపతివేలు

ABOUT THE AUTHOR

...view details