ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నిత్యారాధనలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఉదయం బాలాలయంలో సుప్రభాతం సేవలు మొదలు నుంచి ప్రతిష్ట మూర్తులను మేల్కొల్పి హారతి నివేదించారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధిస్తూ... వేదమంత్రోచ్ఛారణల నడుమ శ్రీ సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేన ఆరాధనతో నిత్య కల్యాణోత్సవ పర్వం చేపట్టారు.
క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని కొలుస్తూ సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజిస్తూ అభిషేకం అర్చనలు నిర్వహించారు. ఆదివారం కావడం వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉంది. కొండపైన ఆలయ పరిసరాల్లో, ప్రసాదాల కౌంటర్, క్యూలైన్లు, తలనీలాలు సమర్పించే చోట, భక్తులతో నిండిపోయింది.