స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా... శత కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి... జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
జన్మనక్షత్రాన నరసింహునికి శతఘటాభిషేకం - YADADRI TEMPLE NEWS
యాదాద్రీశుని జన్మనక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. శత కలశాలతో అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు.
![జన్మనక్షత్రాన నరసింహునికి శతఘటాభిషేకం SPECIAL PROGRAMS IN YADADRI TEMPLE ON SPECIAL OCCASION](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6391057-thumbnail-3x2-ppp.jpg)
SPECIAL PROGRAMS IN YADADRI TEMPLE ON SPECIAL OCCASION
వేదమంత్రలు, మంగళ వాద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. మహాక్రతువులో అర్చకులు, స్థానికులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. హైదరాబాద్కు చెందిన భక్తులు యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి కానుకగా 5 వెండి కలశాలను బహుకరించారు.
జన్మనక్షత్రాన నరసింహునికి శతఘటాభిషేకం