యాదాద్రి పుణ్యక్షేత్ర అభివృద్ధిలో భాగంగా ప్రత్యేక విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఆలయ రాజగోపురాలు, మాడవీధుల్లో బెంగళూరు సంస్థకు చెందిన నిపుణులతో ఆర్కిటిక్ ఆనంద్ సాయి విద్యుద్దీకరణ పనులను చేపట్టారు. గోపురాలకు వెలుతురు వ్యాపించేలా అమర్చిన దీపాల పనితీరును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతా రెడ్డి పరిశీలించారు.
yadadri temple: విద్యుత్ కాంతుల వెలుతురులో యాదాద్రిని ఎప్పుడైనా చూశారా? - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు
యాదాద్రి పుణ్యక్షేత్రం విద్యుత్తు ధగధగలతో మెరుస్తుంది. పసిడి వర్ణంలో భక్తజనులను కనువిందు చేస్తుంది. అష్టభుజి, మండప ప్రాకారాలు, ఆలయ గోపురాలు విద్యుద్దీపాల వెలుగులో భక్తులను ఆకర్షించాయి. ఆలయ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన విద్యుద్దీకరణ పనులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీతా రెడ్డి పరిశీలించారు.
స్తంభోద్భవ సన్నిధికి పసిడి కాంతులు
ఆలయం చుట్టూ చిమ్మచీకట్లు ఉన్న సమయంలో సుదూరం నుంచి స్వామి సన్నిధి విద్యుత్తు ధగధగల నడుమ పసిడి వర్ణంలో మెరుస్తూ... భక్తజనులను కనువిందు చేసింది. అష్టభుజి, మండప ప్రాకారాలు, ఆలయ గోపురాలు విద్యుద్దీపాల వెలుగులో భక్తులను ఆకర్షించాయి.