భాద్రపదమాసం ప్రారంభం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బిందె తీర్థం, బాలభోగం, పర్వాలను నిర్వహించి ఉత్సవమూర్తులకు,అభిషేకం అర్చన కైంకర్యాలు గావించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ శ్రీ సుదర్శననారసింహ హోమం నిర్వహించి, ఉగ్ర నరహరిని శాంతింపజేశారు.
యాదాద్రీశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు - యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిత్య ఆరాధనలు, కల్యాణోత్సవ పర్వాలు వైష్ణవ ఆచారంగా నిర్వహించారు. భాద్రపద మాసం మొదలైన సందర్భంగా బాల ఆలయంలో శ్రీ లక్ష్మీనారసింహునికి ప్రత్యేక పూజలు చేశారు.
యాదాద్రీశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు
సాయంత్రం బాల ఆలయంలో ఆండాళ్ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఊంజల్ సేవ మహోత్సవం నిర్వహించారు. శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పసిడితో తయారుచేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని ఆరాధిస్తూ ముఖమండపంలోని ఉయ్యాలలో శయనింప చేశారు.
ఇదీ చూడండి:'హన్మకొండ చౌరస్తాలో వినాయక చవితి సందడి'