తెలంగాణ

telangana

ETV Bharat / state

టీటీడీ తరహాలో యాదాద్రికి ప్రత్యేక ఆలయ బోర్డు యోచనలో సర్కారు..

అద్భుత ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్వహణ, పాలనా విధానం మారనుంది. టీటీడీ తరహాలో యాదాద్రికి ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారీస్థాయిలో అభివృద్ధి చేసి విస్తరించిన ఆలయ నిర్వహణ... సాఫీగా సాగేలా అందుకు తగ్గట్లుగా పాలకమండలిని ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మహాకుంభ సంప్రోక్షణ పర్వం తర్వాత ఇందుకు సంబంధించి దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

special administration in yadadri as like TTD thinking telangana government
special administration in yadadri as like TTD thinking telangana government

By

Published : Mar 25, 2022, 4:40 AM IST

టీటీడీ తరహాలో యాదాద్రికి ప్రత్యేక ఆలయ బోర్డు యోచనలో సర్కారు..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకొంది. పంచనారసింహ క్షేత్రాన్ని... భక్తులకు దివ్యానుగ్రహం కలిగేలా... విశాలంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేసి విస్తరించారు. భక్తులకు కావాల్సిన వసతులు, సౌకర్యాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి..... వివిధ పనులు చేపట్టారు. అందులో చాలావరకు పూర్తికాగా...మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రముఖుల విడిది కోసం ప్రెసిడెన్షియల్ విల్లాల నిర్మాణం పూర్తి కాగా... భక్తుల విడిది కోసం కాటేజీల నిర్మాణం జరగాల్సి ఉంది.

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్‌ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు... పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. భారీస్థాయిలో అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో.... ప్రస్తుతం ఉన్న విధానం ఆలయ నిర్వహణ, పాలనకు సరిపోదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని..., పాలకమండలి అదే రకంగా ఉండాలని అంటున్నారు.

టీటీడీ తరహాలో ఐఏఎస్ అధికారిని.... కార్యనిర్వహణాధికారిగా నియమించే విధానం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. జేఈఓ, డిప్యూటీ ఈఓ, ఏఈఓ తదితర పోస్టుల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నారు. దేవాదాయశాఖ పరిధిలోనే టీటీడీ తరహా వ్యవస్థ, విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణ పరిపూర్ణం కానుంది. ఆ రోజు నుంచి భక్తులకు.... దర్శన భాగ్యం కలగనుంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.

ఈనెల 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ రానున్నందున బందోబస్తుపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్... పోలీసు అధికారులు, ఆలయ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలు అమర్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details