విఖ్యాత గాయకుడు బాలసుబ్రహ్మణ్యానికి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో మంచి అనుబంధం ఉంది. స్వామి వారి వార్షిక, బ్రహ్మోత్సవాల్లో బాలు పాల్గొనేవారు. 2004 సంవత్సరంలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎస్పీ బాలు.. తన సోదరి ఎస్పీ శైలజతో కలిసి కచేరీ చేశారు. తన గాన మాధుర్యంతో భక్తులను పరవశింపజేశారు. ఎలాంటి పారితోషకం తీసుకోకుండా స్వామి వారి ముందు ఆలపించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో ఎస్పీ బాలు అనుబంధం
గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యానికి యాదాద్రితో ఎనలేని అనుబంధం ఉందని ఆలయ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు తెలిపారు. స్వామి వారి వార్షిక, బ్రహ్మోత్సవాల్లో అమ్మవారి సమేత స్వామి వారిని దర్శించుకునే వారని చెప్పారు. ప్రతిఏడు తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారికి జరిపే పూజల్లో బాలు పాల్గొనేవారని వెల్లడించారు.
యాదాద్రి ఎస్పీ బాలు అనుబంధం
ప్రతిఏటా తన జన్మదినం సందర్భంగా బాలు.. యాదాద్రి స్వామి వారికి ఆభిషేకం చేసేవారు. ఎన్నెన్ని మహిమలు నీవి.. యాదగిరి నరసింహస్వామి.. మమ్మల్ని ఆదుకో సర్వాంతర్యామి, యాదగిరి నరసింహుని చూడాలి.. బాధలన్నీ మర్చిపోవాలి అంటూ తన గాన మాధుర్యంతో స్వామి వారి ఎదుట ఆలపించేవారు.