యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పీఎస్ పరిధిలోని కోనాపూర్ రోడ్డులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. బెల్టు షాపు నిర్వాహకుల వద్ద నుంచి మొత్తం రూ.35 వేల విలువగల మద్యాన్ని, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక పోలీస్టేషన్లో అప్పగించారు.
రాజపేట మండలం బేగంపేట గ్రామంలో రెండు బెల్టు షాపులపై ఎస్వోటి పోలీసులు దాడులు నిర్వహించారు. ఒకరి వద్ద నుంచి రూ.20 వేలు విలువచేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరొక వ్యక్తి వద్ద నుంచి రూ.2,800 విలువ గల మద్యాన్ని సీజ్ చేశారు. ఆలేరు పీఎస్ పరిధిలోని గుండ్లగూడెంలో ఓ వ్యక్తి వద్ద 8 లీటర్ల నాటు సారాయిని పోలీసులు పట్టుకున్నారు.
ఎస్వోటీ పోలీసుల దాడులు.. మద్యం స్వాధీనం - యాదాద్రి భువనగిరి జిల్లా
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. తుర్కపల్లి పీఎస్ పరిధిలోని కోనాపూర్ రోడ్డులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఆటోను పట్టుకున్నారు. రాజపేట మండలం బేగంపేట గ్రామంలో రెండు బెల్టు షాపులపై దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకున్నారు.
ఎస్వోటీ పోలీసుల దాడులు.. మద్యం స్వాధీనం
ఇవీ చూడండి: లాక్డౌన్ ఈనెల 31 వరకు పొడిగింపు