తెలంగాణ

telangana

ETV Bharat / state

పొడిచేడులో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారి - సోడియం హైపోక్లోరైట్ ద్రావణం

యాదాద్రి భువనగిరి జిల్లా పొడిచేడు గ్రామ సర్పంచ్ పేలపూడి మధు.. సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.

sodium hypochlorite solution, podichedu, yadadri bhuvanagiri
sodium hypochlorite solution, podichedu, yadadri bhuvanagiri

By

Published : May 8, 2021, 9:46 PM IST

కరోనా మహమ్మారి ఉద్ధృతం అవుతున్న నేపథ్యంలో.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో సర్పంచ్ పేలపూడి మధు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

రాష్ట్రంలో కరోనా తీవ్రత విపరీతంగా పెరిగిపోతోందని.. గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయని సర్పంచ్ అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కసోజు రవి, భాస్కర్, అంజి, మల్లేశ్​, ధనుంజయ, గణేశ్​, లతీఫ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఫైజర్​తో ఈయూ అతిపెద్ద వ్యాక్సిన్ ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details