రామన్నపేట మాజీ శాసన సభ్యులు గుర్రం యాదగిరి రెడ్డి భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఆయన స్వగ్రామమైన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి తరలించారు. ఈ రోజు ఉదయం నుంచి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునిత, పైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్ రెడ్డిలు పాల్గొని గుర్రం యాదగిరి రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
స్వగ్రామంలో గుర్రం యాదగిరి రెడ్డికి నివాళులు - SO MANY PEOPLE TRIBUTE THE EX MLA GURRAM YADAGIRI REDDY
రామన్నపేట మాజీ శాసన సభ్యులు గుర్రం యాదగిరి రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అభిమానుల భారీగా తరలివచ్చారు.

స్వగ్రామంలో గుర్రం యాదగిరి రెడ్డికి నివాళులు
స్వగ్రామంలో గుర్రం యాదగిరి రెడ్డికి నివాళులు
ఇవీ చూడండి: వంతెన పై నుంచి కారుపై పడిన మరోకారు.. మహిళ మృతి