నాగార్జునసాగర్ నుంచి వచ్చిన తర్వాత ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త టీఎస్సీఏబీ వైస్ ఛైర్మన్ మహేందర్రెడ్డిలకు స్వల్పంగా కరోనా లక్షణాలు ఉండటం వల్ల ఐసోలేషన్లో ఉన్నామని తెలిపారు. గతేడాది కరోనా కల్లోలం చూసి… చాలా మందికి 2020 జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంవత్సరం అనుకున్నాము… కానీ మళ్లీ కరోనా సెకండ్ వేవ్ చూశాక 2021 ఇంకా దారుణంగా ఉండబోతుందని తెలుస్తోందని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులకు కరోనా లక్షణాలు - కరోనా తాజా వార్తలు
ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. వారికి స్వల్ప కరోనా లక్షణాలు ఉండటంతో ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే.. ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు.
![ఎమ్మెల్యే గొంగిడి సునీత దంపతులకు కరోనా లక్షణాలు aler mla gongidi sunitha, corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:48:23:1619083103-tg-nlg-81-22-aler-gongidi-dhampathulu-isolation-av-ts10134-22042021143856-2204f-1619082536-940.jpg)
aler mla gongidi sunitha
ఏదైనా సమస్యలు ఉంటే.. ఫోన్ ద్వారా సంప్రదించాలని ప్రజలను కోరారు. అందరూ మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.