యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వరస్వామి బాలాలయంలో ప్లవనామ సంవత్సరం, సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు చర మూర్తులు కొలువై ఉన్న ఉపాలయంలో అర్చకులు ఆస్థాన పరంగా శ్రీకారం చుట్టారు. గణపతికి తొలి పూజలు చేపట్టిన పురోహితులు, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, రక్షాబంధన, నిత్య పూజా కైంకర్యాలు శైవాగమ శాస్త్ర రీతిలో నిర్వహించారు.
యాదాద్రిలో సీతారామచంద్ర స్వామి వసంతోత్సవాలు ప్రారంభం - yadadri district latest news
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలయమైన శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వరస్వామి బాలాలయంలో ఉగాది వేడుక ఘనంగా జరిగింది. శ్రీ సీతారామచంద్ర స్వామి వసంత నవరాత్రి ఉత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనల కారణంగా అర్చకులు అంతరంగికంగా ఈ పూజలు నిర్వహించారు.
కొవిడ్ నిబంధనల కారణంగా అర్చకులు అంతరంగికంగా పూజలు నిర్వహించారు. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 24 వరకు జరగనున్నాయి. 20న సీతారామచంద్ర స్వామి వారి ఎదుర్కోలు, 21న కళ్యాణ మహోత్సవం, 22న పట్టాభిషేక మహోత్సవం, 23న సత్యనారాయణ స్వామి వ్రతం, 24న నిత్య పూజాదులు, కంకణ విమోచనముతో ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, పురోహితులు, శివాలయ ప్రధాన అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నాగార్జునసాగర్‌లో ప్రచారజోరు పెంచిన భాజపా