తెలంగాణ

telangana

ETV Bharat / state

సైకో శ్రీనివాస్​రెడ్డిని మాకు అప్పగించండి: సిట్ - SRINIVAS REDDY

సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్య కేసుల ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని... తమకు అప్పగించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పోలీసులు. పోక్సో చట్టం కింద కేసులు ఉన్నందున పూర్తిస్థాయిలో విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని సిట్ కోరింది.

సైకో శ్రీనివాస్​రెడ్డిని మాకు అప్పగించండి: సిట్

By

Published : May 4, 2019, 11:31 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్న విద్యార్థినుల వరుస హత్యలపై... పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన ప్రధాన నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పోక్సో చట్టం ప్రయోగిస్తే కఠిన శిక్షలు పడే ఆస్కారం ఉంది.

శ్రీనివాస్ రెడ్డి కేవలం హాజీపూర్​లోనే ఇలాంటి ఘనటలకు పాల్పడ్డాడా లేదా వివిధ ప్రాంతాల్లోనూ నేరాలు చేశాడా అనే విషయాలు తెలుసుకునే పనిలో ఉన్నారు పోలీసులు. అందులో భాగంగానే నిందితుణ్ని తమకు అప్పగించాలంటూ నల్గొండ మొదటి అదనపు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు గతంలో ఆదిలాబాద్, వేములవాడ ప్రాంతాల్లోనూ తిరిగాడు. కర్నూల్​లో జరిగిన హత్య కేసులో హస్తం ఉండటంతో అలాంటి ఘటనలు ఈ రెండు ప్రాంతాల్లో ఏమైనా జరిగాయా అన్న కోణంలోనూ కూపీ లాగనున్నారు.

బావిలో దొరికిన అస్థికలను ఫోరెన్సిక్ ల్యాబ్​కు పంపించారు. నాలుగేళ్ల క్రితం తప్పిపోయిన బాలిక తల్లిదండ్రుల రక్త నమూనాలు సేకరించారు. నివేదికకు నెల రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. శ్రీనివాస్ రెడ్డి ఫేస్​బుక్ ఖాతాలపైనా పోలీసులు దృష్టి సారించారు. రెండు ఖాతాలున్నట్లు గుర్తించారు. నిందితుడు చెబుతున్నట్లు నిజంగానే ఈ హత్యలు ఒక్కడే చేశాడా... ఇతరుల ప్రమేయమేదైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

సైకో శ్రీనివాస్​రెడ్డిని మాకు అప్పగించండి: సిట్

ఇవీ చదవండి: తుపానులకు పేర్లు ఎప్పటినుంచి పెడుతున్నారు?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details