తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ప్రధాన ఆలయాలకు ప్రత్యేక శోభ - తెలంగాణ వార్తలు

యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయాల ద్వారాలకు వెండి తొడుగులు తాపడం చేయనున్నారు. వీటన్నిటికీ సుమారు 900 కిలోల వెండిని వినియోగిస్తున్నట్లు యాడ అధికారులు తెలిపారు. ఇవి పూర్తయితే ఆలయం మరింత శోభను సంతరించుకోనుంది.

silver-to-the-gates-of-main-temple-of-yadadri-lakshmi-narasimha-swamy-temple-in-yadadri-bhuvanagiri-district
యాదాద్రి ప్రధాన ఆలయాలకు ప్రత్యేక శోభ

By

Published : Feb 27, 2021, 1:23 PM IST

యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా నూతన ప్రధాన ఆలయంలోని ద్వారాలకు వెండి తొడుగులు తాపడం చేయనున్నారు. ప్రధాన ఆలయంలోని శయన మండపం, ఆండాళ్ అమ్మవారు, రామానుజ ఆళ్వార్ల మండపం, ఉపాలయాలకు ద్వారాలకు వెండి తొడుగులు బిగించే పనులు ప్రారంభించారు. నూతన శివాలయం గర్భాలయ ద్వారానికి వెండి తొడుగులు అమర్చనున్నారు.

ద్వారాలకు ప్రత్యేక శోభ

త్రితల రాజగోపుర ద్వారానికి, గణపతి, పార్వతి ఉపాలయాలకు, ఆంజనేయ స్వామి ఉపాలయ ద్వారానికి వెండి తొడుగులు అమర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటన్నిటికీ సుమారు 900 కిలోల వెండిని వినియోగిస్తున్నట్లు యాడ అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయితే ఆలయం మరింత శోభను సంతరించుకోనుంది.

ఇదీ చదవండి:నేటితో ముగియనున్న మేడారం చినజాతర

ABOUT THE AUTHOR

...view details