యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలో కలకలం రేపిన ఇద్దరు బాలికలు హత్య కేసులో నిర్లక్ష్యం వహించిన ఎస్సైపై వేటు వేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడం, నేరాలను నియంత్రించడంలో చొరవ చూపని కారణంగా... సబ్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్‌ను సస్పెండ్ చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. శ్రావణి, మనీషా హత్య కేసులో విచారణ ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. ఈ కేసుపై భువనగిరి ఏసీపీ భుజంగరావు విచారణాధికారిగా నియమించినట్లు మహేశ్ భగవత్ స్పష్టం చేశారు.
బొమ్మల రామారం ఎస్సై వెంకటేశ్‌పై వేటు - rachakonda commisoner
నేరాల నియంత్రణలో అలసత్వం వహించారని బొమ్మల రామారం ఎస్సై వెంకటేశ్‌ను సీపీ మహేశ్ భగవత్ సస్పెండ్ చేశారు. శ్రావణి, మనీషాల హత్య కేసులో విచారణ కొనసాగుతోందన్న సీపీ... కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తున్నామని అన్నారు. విచారణాధికారిగా భువనగిరి ఏసీపీని నియమించామని పేర్కొన్నారు.
అలసత్వం వహించిన ఎస్సైపై వేటు
Last Updated : Apr 30, 2019, 10:50 AM IST