యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆరురోజుల పాటు అర్చకులు.. వేదమంత్రోచ్ఛారణలు, నిత్య హవనములు, వివిధ పారాయణాలు, శివ పంచాక్షరి జపాలు నిర్వహించారు.
యాదగిరిగుట్టలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు - shivratri utsav completed in yadagirigutta
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిశాయి.

యాదగిరిగుట్టలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు
ఆఖరి రోజైన ఇవాళ శివ బాలాలయంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపి ఉత్సవాలను ముగించారు. శివరాత్రి ఉత్సవాల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త, ఆలయ అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్టలో ముగిసిన శివరాత్రి ఉత్సవాలు